రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో సౌత్ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. అయితే విచిత్రం ఏంటంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
జైలర్ సినిమాను థియేటర్లలో మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో మాత్రం ఈ సినిమాను మరోసారి చూసి ఈ సినిమాను మరింత భారీ హిట్ చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఫ్యాన్స్ సైతం జైలర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ సినిమా ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. సౌత్ భాషల్లో, హిందీలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం గమనార్హం.
జైలర్ (Jailer) సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో జైలర్ కు సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. జైలర్ సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. జైలర్ సక్సెస్ తో తమిళ, తెలుగు భాషల్లో నెల్సన్ దిలీప్ కుమార్ పేరు మారుమ్రోగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో పని చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు.
రజనీకాంత్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రజనీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. రజనీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?