Jailer: జైలర్ మూవీ విలన్ నిజస్వరూపం ఇదేనా.. అసలేం జరిగిందంటే?

కొన్ని సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై సంచలనాలు సృష్టిస్తాయి. ఈ మధ్య కాలంలో అలా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమాలలో జైలర్ సినిమా ఒకటి. ఈ సినిమా హెచ్డీ ప్రింట్ తాజాగా లీకైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సన్ నెక్స్ట్ ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. జైలర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వినాయకన్ నటించి ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్రముఖ నటుడు ఒక మోడల్ తో అసభ్యంగా ప్రవర్తించారని సమాచారం. 1995 నుంచి వినాయకన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కెరీర్ తొలినాళ్లలో పెద్దగా ప్రాధాన్యత లేని రోల్స్ లో నటించిన వినాయకన్ ఆ తర్వాత మెయిన్ విలన్ రోల్స్ లో నటించే స్థాయికి ఎదిగారు. జైలర్ మూవీ సక్సెస్ తో వినాయకన్ కు ఊహించని స్థాయిలో ఆఫర్లు పెరుగుతుండటం గమనార్హం. 2019 సంవత్సరంలో మోడల్ మృదులా దేవితో వినాయకన్ అసభ్యంగా మాట్లాడారు.

ఆ సమయంలో మృదులా దేవి పోలీసులను ఆశ్రయించగా పోలీసులు వినాయకన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో వినాయకన్ బెయిల్ పై రిలీజ్ కావడం జరిగింది. మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసిన వినాయకన్ ఆ ఇండస్ట్రీలో మంచి పేరును సొంతం చేసుకున్నారు.

జైలర్ (Jailer) సినిమాతో వినాయకన్ కు మంచి పేరు రావడంతో ఆయనకు ఆఫర్లు పెరుగుతుండగా ఇలాంటి సమయంలో ఆయనకు సంబంధించిన పాత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివాదాల గురించి, ఆరోపణల గురించి వినాయకన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఒక వర్గం ప్రేక్షకులు వినాయకన్ ను ఎంతగానో అభిమానిస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus