‘జైలర్’ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీనికి కారణం ఏంటా అని అంతా డిస్కస్ చేసుకుంటూ ఉండటంతో ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. వినాయకన్ ఫుల్ గా తాగేసి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యంగా ప్రవర్తించాడట. కొంతమంది అతన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ.. అతను వినకపోగా వారిని ఇష్టమొచ్చినట్టు బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాడట. దీంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని.. వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకులం(కేరళ) లోని జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారట పోలీసులు. వినాయకన్ ప్రవర్తన ఎప్పుడూ అలానే ఉంటుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి అతని అరెస్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ‘జైలర్’ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించిన వినాయకన్ పూర్తి పేరు టి.కె.వినాయకన్. ఇతనొక మలయాళ నటుడు.
మొదట ఇతను ఓ డాన్సర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత దర్శకుడిగా మారి ‘తమ్పి కన్నతనం’ అనే సినిమా చేశాడు. అటు తర్వాత ఇతను చాలా సినిమాల్లో నటించాడు. కానీ తెలుగులో కూడా ఓ సినిమాలో నటించాడు అనే సంగతి చాలా తక్కువ మందికే తెలిసుండొచ్చు. 2006 లో వచ్చిన ‘అసాధ్యుడు’ అనే సినిమాలో నటించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఇందులో వినాయకన్ సెకండ్ విలన్ గా కనిపించాడు.