Jalsa Movie: పవన్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. ఏమవుతుందో?

హీరోల పుట్టిన రోజునాడు కొత్త సినిమా విడుదలైతే చూస్తాం, లేదంటే లేదు అని అనుకునేవారు ఒకప్పుడు. కానీ రీసెంట్‌గా అభిమానుల ఆలోచన మారింది. తమ అభిమాన హీరో పుట్టిన రోజు నాడు పాత సినిమాను రీ రిలీజ్‌ చేయించాలని చూస్తున్నారు. దాని కోసం మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఓవైపు ప్లాన్స్‌ చేస్తుంటే, తాజాగా పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కూడా రంగంలోకి దిగారు. సోషల్‌ మీడియా వేదికగా ‘జల్సా సినిమా రీ రిలీజ్‌’ అని ట్రెండింగ్‌ చేశారు. దీంతో ఆ సినిమా కోసం ఓ నిర్మాత చేసిన ప్రయత్నంతో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

‘జల్సా రీరిలీజ్‌’ అనే ట్రెండింగ్‌ను చూసి దర్శకుడు, నిర్మాత అయితే సాయి రాజేశ్‌.. ఆ సినిమా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ను సంప్రదించారట. అయితే ఆ సినిమాను థియేటర్‌లో ప్రదర్శించడానికి అవసరయమ్యే ఒరిజినల్ డీపీఎక్స్ (డిజిటల్‌ పిక్చర్స్‌ ఎక్స్‌ఛేంజ్‌) ఫైల్ మిస్ అయ్యింది అనే సమాధానం వచ్చిందట. ప్రస్తుతం ఆ ఫైల్‌ వెతికే పనిలో ఉన్నామని, దొరకగానే ఇస్తామని గీతా ఆర్ట్స్‌ టీమ్‌ చెప్పారట. దీంతో ‘జల్సా’ను మరోసారి వెండితెర మీద చూడాలని అనుకుంటున్న ఫ్యాన్స్‌ ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది అని అంటున్నారు.

సెప్టెంబరు 2న పవన్‌ జన్మదినం నాడు ‘జల్సాను’ వెండితెరపై చూసి పండగ చేసుకోవాలని ఫ్యాన్స్‌ ముచ్చటపడ్డారు. అయితే డీపీఎక్స్‌ మిస్‌ అవ్వడంతో ఏమవుతుందా? అనే పరిస్థితి నెలకొంది. అభిమానులు మరో సినిమాను ఎంచుకుంటారా? లేక ఆ సినిమా డీపీఎక్స్‌ కోసమే ఎదురుచూస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయినా సినిమా డీపీఎక్స్‌ మిస్‌ అవ్వడం ఏంటి అనే ప్రశ్న కూడా సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. సినిమా విషయంలో ఇంత అశ్రద్ధ వహిస్తారా అనే ప్రశ్న కూడా కనిపిస్తోంది.

ఆ విషయం పక్కన పెడితే.. ఈ రీ రిలీజ్‌ కాన్సెప్ట్‌ను అందరు హీరోల అభిమానులు టేకోవర్‌ చేయాలని చూస్తున్నారట. తమ అభిమాన హీరో సినిమాను మరోసారి సిద్ధం చేసి, రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారని సమాచారం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus