మహానటిని ఎందుకు చూడలేదో చెప్పిన జమున .!

వెండితెర సత్యభామగా అలనాటి నటి జమునకి మంచి పేరుంది. ఆమె సావిత్రి తో కలిసి మిస్సమ్మ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సావిత్రిని అక్కా అని పిలిచేవారు. వీరిమధ్య మంచి అనుబంధం ఉండేది. అయినా సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటిని జమున ఇంకా చూడలేదు. ఎందుకు చూడలేదంటే ఆసక్తికర సమాధానం చెప్పారు. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” సావిత్రితో వున్న అనుబంధం కారణంగా ఆమె జీవితంపై సినిమా రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాంటి ప్రయత్నాన్ని చేసిన ఈ సినిమా టీమ్ కి .. సావిత్రిగా చేసిన కీర్తి సురేశ్ కి అభినందనలు.

సావిత్రి వంటి ‘మహానటి’ జీవితాన్ని తెరకెక్కించడం సాహసమేనని చెప్పాలి. జనానికి సినిమా బాగా నచ్చే ఉంటుంది. లేకపోతే ఎందుకు చూస్తారు. గతంలో ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే .. మా(సీనియర్స్) అందరినీ పిలిచి ప్రివ్యూ వేసి చూపించేవారు. ఇప్పుడు ఆ విధానమే పోయింది. మీరొచ్చి సినిమా చూశారా? అని అడిగితే నేను ఏం చెబుతాను? నేను సినిమా హాలుకి వెళ్లి టికెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కైకాల సత్యనారాయణ ఇదే విధంగా బాధపడ్డారు. నేటి వారికి తామంటే విలువేలేదని మీడియాతో వాపోయారు. నేటి సినిమాలకు సీనియర్స్ ని ఆహ్వానించకపోయినా ఫరవాలేదు కానీ మహానటిని మాత్రం అలనాటి నటీనటులకు ప్రత్యేక షో వేస్తే పై నున్న సావిత్రి కూడా సంతోషిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus