పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “అజ్ణాతవాసి” షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకొనివచ్చి నిన్నటివరకూ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేశాడు. సినిమాలతోపాటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ గా విశాఖపట్నం పయనమవుతున్నాడు. గత కొన్నేళ్లుగా “డి.సి.ఐ” సంస్థ ప్రయివేటీకరణ విషయంలో ప్రభుత్వం మరియు డి.సి.ఐ సంస్థ ఉద్యోగుల మధ్య జరుగుతున్న వివాదాలు తెలిసినవే. ఈ విషయమై ఇటీవల వెంకటేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఇష్యూ సీరియస్ అయ్యింది. దీంతో రంగంలోకి దూకాడు పవన్ కళ్యాణ్.
ఈ విషయమై రేపు వైజాగ్ లో బహిరంగ సభ నిర్వహించి.. తెలుగు దేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నాడు. అలాగే.. “డి.సి.ఐ” సంస్థను ప్రయివేట్ పరం చేయడాన్ని కూడా ఖండించి.. సదరు సంస్థ ఉద్యోగులకు బాసటగా నిలవనున్నాడు. అలాగే.. అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజులపాటు యాత్ర కూడా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. పోలవరం ఇష్యూ గురించి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన సందేశాలివ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కుదిరినంత తొందరగా స్పందించాలని పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని జనసేన కార్యకర్తలు కూడా కోరుకొంటున్నారు.