సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే చాలా రిలీజ్ అయ్యాయి. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu) ‘గొర్రె పురాణం’ (Gorre Puranam) వంటివి ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. తాజాగా ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. అక్టోబర్ 12న రిలీజ్ అయ్యింది. (Dil Raju) ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి. (Harshith Reddy), హన్షిత రెడ్డి (Hanshitha Reddy). .లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, పాటలు వంటివి ఇంప్రెస్ చేశాయి. మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పెద్ద ఆశాజనకంగా లేవు. ఒకసారి(Janaka Aithe Ganaka) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో 2 రోజుల్లో రూ.1.07 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.93 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.