సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే చాలా రిలీజ్ అయ్యాయి. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu) ‘గొర్రె పురాణం’ (Gorre Puranam) వంటివి ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మరో 2 రోజుల్లో అంటే అక్టోబర్ 12న ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) ప్రేక్షకుల ముందుకు రానుంది. విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. (Dil Raju) ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి. (Harshith Reddy), హన్షిత రెడ్డి (Hanshitha Reddy). .లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, పాటలు వంటివి ఇంప్రెస్ చేశాయి. దీంతో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.30 cr |
సీడెడ్ | 0.50 cr |
ఆంధ్ర(టోటల్) | 1.20 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
ఓవర్సీస్ | 0.30 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 3.50 cr |
‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.