“నాన్నకు ప్రేమతో” చిత్రం తర్వాత తారక్ చేస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. హిట్ ట్రాక్ లో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్స్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్ర ఆడియోని జులై 22 న రిలీజ్ చేయనున్నారు.
ఈ ఆడియో వేడుకను ఖమ్మంలో అభిమానుల సమక్షంలో నిర్వహించాలని తొలుత భావించారు. కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు హాజరుకావడానికి ఇబ్బంది అవుతుందని భావించి వేదికను మార్చారు. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు చిత్రం బృందం ఫిక్స్ అయింది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రానున్నట్లు సమాచారం. నాన్నకు ప్రేమతో నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు.
జనతా గ్యారేజ్ చిత్ర షూటింగ్ సమయంలోనూ ఫ్యాన్స్ కి కొత్త సమయం కేటాయించారు. ఈ సినిమాతో తన అభిమానుల ఘనాన్ని పెంచుకోవాలని .. ఆడియో వేడుకను ఇది వరకు ఎన్నడూ జరగనంత ఘనంగా నిర్వహించనున్నారు.