‘జనతా గ్యారేజ్’ ఆడియోకి రెడీ!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపధ్యంలో సినిమా పాటలను ఈ నెల 22న విడుదల చేసి ఆగస్ట్ 12 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ లోని శిల్పా కళా వేదికలో ఘనంగా అభిమానుల మధ్య ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పూరీజగన్నాథ్, కల్యాణ్ రామ్, హరి కృష్ణ లు ముఖ్య అతిథులుగా రానున్నారు. గతంలో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ కు కూడా అన్నయ్య కల్యాణ్ రామ్, హరికృష్ణలు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ను స్టేజ్ మీద చూడనున్నాం. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో అందరి దృష్టి ఈ ఆడియోపై పడింది. మరి ఈ పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో.. చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus