యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘జనతా గ్యారేజ్’. 2016 వ సంవత్సరం సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 7 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్లతో ఎన్టీఆర్… ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ వంటి హిట్లతో కొరటాల శివ.. మంచి ఫామ్లో ఉన్న టైములో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మోహన్ లాల్ వంటి స్టార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో సినిమా పై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. వాటికి తగ్గట్టే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది.
ఆ కలెక్షన్ల వివరాలను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 18.95 cr |
సీడెడ్ | 11.70 cr |
ఉత్తరాంధ్ర | 7.41 cr |
ఈస్ట్ | 4.70 cr |
వెస్ట్ | 4.05 cr |
గుంటూరు | 5.75 cr |
కృష్ణా | 4.41 cr |
నెల్లూరు | 2.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 59.29 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.71 cr |
ఓవర్సీస్ | 7.21 cr |
మలయాళం | 1.84 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 80.05 cr |
‘జనతా గ్యారేజ్’ చిత్రానికి రూ.67.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.80.05 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లకు రూ.12.81 కోట్ల లాభాలు దక్కాయన్న మాట. ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్ మూవీకి రూ.10 కోట్ల పైగా లాభాలు రావడం ‘జనతా గ్యారేజ్’ కే జరిగింది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!