‘జనతా’లో స్పెష్యాలిటీస్ ఇవే!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్…మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం రేపు విడుదలకు రంగం సిద్దం చేసుకుంది. యంగ్ టైగర్ గర్జించడానికి సిద్దం అయిన క్రమంలో ఒక్క ఆంధ్ర దేశంలోనే కానీ, టోటల్ సౌంత ఇండియా మొత్తం ఎన్టీఆర్ మ్యానియాతో షేక్ అవుతుంది. ఒక పక్క వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు, మరో పక్క వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అని ఇప్పటికే పాసిటివ్ బజ్ అంతటా వ్యాపించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంభందించి కొన్ని స్పెష్యాలిటీస్ ఉన్నాయి…అవేమిటంటే….

ఈ సినిమాలో ఎన్టీఆర్ మొట్టమొదటి సారి మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలసి నటిస్తున్నాడు.
విచిత్రంగా అటు సమంతా, ఇటు ఎన్టీఆర్ ఇద్దరికీ ఈ సినిమా తమ కరియర్ లో 26వ సినిమా అవుతుంది.
తన కరియర్ లోనే అందాల భామా కాజాల అగర్వాల్ ఐటమ్ సాంగ్ లో కనిపిస్తుంది.
తమిళంలో టాప్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ తిరు ఈ సినిమాతో మొట్టమొదటి సారి తెలుగులో పనిచేస్తున్నారు.
ఇక అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల ఇద్దరు రెండు వరుస హిట్స్ ఇచ్చి, హ్యాట్రిక్ కోసం మంచి ఆకలిగా ఎదురు చూస్తున్నారు.

ఇలా ఒక్కటెంటి….చాలా ప్రత్యేకతలు ఈ సినిమాలో ఉన్నాయి…మరి ఇదే ఊపులో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే యంగ్ టైగర్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవ్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus