జనతా..’సక్సెస్ మీట్’లో మార్పు!!!

ఆకలి తీరింది…ప్రభంజనం మొదలయింది…ఎన్నాళ్లుగానో, ఎన్నో ఏళ్లుగానో…ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సూపర్ హిట్ దక్కింది….కొరటాల శివ తన స్టైల్ లో సందించిన సూపర్ హిట్ మూవీ ‘జనతా గ్యారేజ్’. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ….సినిమా మాత్రం చాలా సేఫ్ జోన్ లో నడుస్తుంది అని కలెక్షన్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే ఈ స్నిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసి….సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇక అదే క్రమంలో ఈ సినిమా సక్సెస్ ను అటు ఫ్యాన్స్ తోనూ, ఇటు మూవీ డిస్‌ట్రిబ్యుటర్స్ తోనూ పంచుకోవాలి అని పక్కా ప్లాన్ తో ఉన్నాడు మన ఎన్టీఆర్.

అయితే…ముందుగా..ఈ నెల 10 వైజాగ్ లో సక్సెస్ మీట్ ని ప్లాన్ చేశాడు ఎన్టీఆర్….కానీ…గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల నుంచి అనుమతి ఇవ్వకపోవడంతో తన ఆనందాన్ని మరో రూపంలో పంచుకోవాలని ఎన్టీఆర్ డిసైడ్ సమాచారం. అదేలా అంటే….మొత్తం జనతా గ్యారేజ్ టీమ్ మెంబర్లతో పాటు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లందరికీ హైద్రాబాద్ లో పెద్ద పార్టీ ఏర్పాటు చేయాలని.. దీనికి ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కూడా హాజరు కానున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇక భారీ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా…కార్యక్రమంలో భాగంగా…ముందు యూనిట్ తో సక్సెస్ మీట్ నిర్వహించి.. తర్వాత జనతా గ్యారేజ్ టీమ్ కోసం ఏర్పాటు చేసిన పార్టీకి అటెండ్ అవుతాడట యంగ్ టైగర్. మొత్తానికి ఎన్టీఆర్ అలా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus