Bro Movie: ‘బ్రో’ నుండి మరో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • July 15, 2023 / 05:14 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రాబోతుంది. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రూపొందింది.ఒరిజినల్ ను తెరకెక్కించిన సముద్రఖని ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, కాలం అనే థీమ్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

ఫస్ట్ సింగిల్ ‘మార్కండేయ’ కి సో సో రెస్పాన్స్ వచ్చినా.. జనాలు బాగానే వింటున్నారు. తాజాగా సెకండ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘జాణవులే’ అంటూ సాగే ఈ పాట.. స్లోగా స్టార్ట్ అయ్యింది కానీ తర్వాత ఆకట్టుకునే విధంగా సాగింది. సంగీత దర్శకుడు తమన్ ఈసారి క్యాచీ ట్యూన్ ఇచ్చాడు.కొంత గ్యాప్ తర్వాత ఈ పాట కోసం వోకల్స్ లో సాంగ్ పాడడం వల్ల వినసొంపుగా అనిపించింది. సాయి ధరమ్ తేజ్ మరియు కేతిక శర్మల మధ్య వచ్చే డ్యూయెట్ ఇదని స్పష్టమవుతుంది.

ఈ పాటలోని (Bro Movie) విజువల్స్,లొకేషన్స్ …. హీరో హీరోయిన్ల కాస్ట్యూమ్స్ బాగున్నాయి అని చెప్పాలి. మొదటి పాట కంటే ఈ పాట బెటర్ గానే ఉంది. మైనస్ గురించి చెప్పుకోవాలి అంటే ఈ పాటలో కూడా సాయి ధరమ్ తేజ్ స్టెప్స్ ఇబ్బందిగా ఉన్నాయి అనిపిస్తుంది. వినడానికి అయితే ఈ పాట బాగానే ఉంది. ఓసారి వినేయండి :

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus