Janhvi Kapoor: ఇంట్రెస్టింగ్‌ ముచ్చట్లు… ‘దేవర’ విషయాలు చెప్పిన జాన్వీ కపూర్‌.. విన్నారా?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఎప్పుడు టాలీవుడ్‌కి వస్తుందా? అని చాలా రోజులుగా అభిమానులు, సినిమా ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రాజెక్ట్‌లు దాదాపు ఓకే అయినా ఏదో కారణంగా ముందుకు వెళ్లలేకపోయాయి. అయితే ఎట్టకేలకు ‘దేవర’ సినిమాతో ఇది నిజమైంది. ఈ సినిమాకు సంబంధించి గతంలో జాన్వీ ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సరికొత్త షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘దేవర’ సినిమాలో నటిస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది అంటూ టాలీవుడ్‌ విషయంలో తన అభిమానాన్ని చాటుకుంది జాన్వీ కపూర్‌. శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ… ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా ఆ స్టార్‌ ఇమేజ్‌ రావడం లేదు. సోషల్‌ మీడియాలో అందాల ఒలకబోతతో ఎప్పుడూ హాటెస్ట్‌ సెలబ్రిటీగా నిలుస్తున్న జాన్వీకి సరైన స్టార్‌ స్టేటస్‌ వచ్చే సినిమా ఇంకా పడలేదు అనే చెప్పాలి.

ఆ సినిమా ‘దేవర’ అని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాల్లో. ఈ సినిమాలో జాన్వీ తంగమ్‌ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. సినిమాలో చాలా మలుపుకు జాన్వీ కపూర్‌ చుట్టే తిరుగుతాయట. సినిమాలో హీరో ఉగ్ర రూపమెత్తిన ప్రతిసారి హీరోయిన్‌ పాత్ర కీలకంగా మారుతుంది అని అంటున్నారు. భయాన్నే భయపెట్టే భయంగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కనిపిస్తాడు అని ఇప్పటికే చెప్పేశారు. అదేంటో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాలి.

ఇక జాన్వీ (Janhvi Kapoor) చెప్పిన ముచ్చట్లు చూస్తే… ‘దేవర’ సినిమా కోసం సెట్లో అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ నా సొంత వాళ్లలా అనిపిస్తారని చెప్పింది. అమ్మతో తనకున్న అనుబంధం వల్ల అలా అనిపిస్తుందేమో అని చెప్పింది. దక్షిణాదిన సినిమా చేయడం ద్వారా అమ్మతో ఇంకాస్త అటాచ్‌ అయినట్లు అనిపిస్తోందన్న జాన్వీ… ఇది తనకొక డివోషనల్‌ ఫీలింగ్‌’ అని చెప్పింది. అన్నట్లు ‘దేవర’ తొలి పార్టు ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus