‘పెద్ది’ సినిమా నుండి ఇటీవల ‘చికిరి చికిరి..’ అనే పాట విడుదలైంది. అందులో రామ్‌చరణ్ డ్యాన్స్ ఒక హైలైట్ అయితే.. రెండో హైలైట్ జాన్వీ కపూర్ గ్లామర్ షో. ఇలా కొందరు అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం జాన్వీని అందాల ప్రదర్శన కోసమే ఈ సినిమాలో వాడుకున్నారు అనే మాట అంటున్నారు. జాన్వీని ఓ గ్లామర్ డాల్‌లా చూపించే కంటే ఆమెలో నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయొచ్చు కదా అనే సలహా కూడా ఇస్తున్నారు. దీంతో యాక్టర్ జాన్వీ వర్సెస్ గ్లామర్ డాల్ జాన్వీ అనేలా మారిపోయింది.
ఈ క్రమంలో రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి జాన్వీ కపూర్ కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు. ఆమెకు ‘పెద్ది’ సినిమాలో నటిగా నిరూపించుకునే సీన్స్ చాలానే ఉంటాయి అని సమాచారం. మరో విషయం ఏంటంటే ఆమె నటిగా కొత్తగా ఇప్పుడు ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఆమె అలాంటి సినిమాలు చాలానే చేసింది. ఓటీటీలో కూడా ఆ సినిమాలు వచ్చాయి. వాటికి సరైన ఆదరణ దక్కలేదు. అయితే గ్లామర్ షో చేసిన సినిమాలకు ఆదరణ దక్కింది.
దానికి తోడు ఓ అందాల భామను అలానే చూపిస్తేనే ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చుతుంది. అదే సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే అగ్ర హీరోలతో సినిమాలు చేసినప్పుడు హీరోయిన్లకు లెంగ్తీ రోల్ దక్కడం, స్క్రీన్ టైమ్ ఎక్కువగా దక్కడం కష్టమే. అలా జాన్వీ కపూర్‌ను ఓ కమర్షియల్ సినిమాలో గ్లామర్ టచ్‌లో చూపించకుండా ఉండటం కష్టమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీని ఓ రకం సినిమాలకే పరిమితం చేశారు అనడం సరికాదు.
ఎందుకంటే చాలా సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఇలా జాన్వీలాగా నటిస్తున్నారు. ఆమెకు ట్రోలింగ్ కొత్త కాదు కాబట్టి లుక్, పాట చూడగానే కామెంట్లు రావడం పెద్ద విషయంగా కనిపించడం లేదు కానీ.. లేకపోతే పెద్ద విషయమే. ఇదంతా చూస్తుంటే జాన్వీ నటిస్తే బాలీవుడ్‌లో నచ్చడం లేదు.. నటించకుండా స్కిన్ షో చేస్తుంటే సౌత్‌లో కొంతమందికి నచ్చడం లేదు.