Janhvi Kapoor: జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమైనట్లే!

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ను టాలీవుడ్ కి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నించారు. కొందరు దర్శకనిర్మాతలు నేరుగా ముంబై వెళ్లి మరీ జాన్వీకపూర్ ని కలిశారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా ఒప్పుకోలేదు. మెహర్ రమేష్, నాగార్జున ఇలా చాలా మంది జాన్వీని తెలుగు తెరకి పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఎవరి వలన కాలేదు. మరోపక్క జాన్వీకపూర్ తండ్రి బోనీకపూర్ మాత్రం ఎప్పటికప్పుడు తన కూతురు కచ్చితంగా సౌత్ లో నటిస్తుందంటూ చెబుతున్నారు.

Click Here To Watch NOW

ఎట్టకేలకు జాన్వీకపూర్ నటించబోయే తెలుగు ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ఉంది. నిన్న లాంచ్ అయిన ‘జేజీఎం'(జనగణమన) ప్రాజెక్ట్ లోకి జాన్వీకపూర్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాన్వీకపూర్ ని పూరి జగన్నాథ్ ఒప్పినట్లు బాలీవుడ్ మీడియాలో కథను వస్తున్నాయి. అయితే ఈ వార్తలను జాన్వీకపూర్ టీమ్ ఖండించకపోవడం విశేషం. తనకు టాలీవుడ్ అంటే ఇష్టమని.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఉందంటూ గతంలోనే జాన్వీకపూర్ పలు సందర్భాల్లో ప్రకటించింది.

విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ వస్తే మిస్ చేసుకోనని చెప్పింది. ఇప్పుడు విజయ్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఈ సినిమా కోసం జాన్వీకపూర్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోబోతుందట. బాలీవుడ్ హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేయడం పూరి జగన్నాథ్ కి కొత్తేమీ కాదు. గతంలో కంగనా, దిశాపటానీ లాంటి ముద్దుగుమ్మలను టాలీవుడ్ కి తీసుకొచ్చాడు పూరి. త్వరలోనే అనన్య పాండేను కూడా తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి జాన్వీకపూర్ కూడా చేరబోతుందని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది. మరి హీరోయిన్ ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus