Janhvi Kapoor: ఆలియాను ఫాలో అయిన జాన్వీ.. అవార్డులు, వసూళ్లు వస్తాయా?

అందం, ఫిజిక్‌, నటనలో మేజిక్‌ ఉన్న స్టార్‌ హీరోయిన్లు ఒక్కోసారి ట్రాక్‌ మార్చి యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేస్తుంటారు. అలా వచ్చినవాళ్లు ఊహించని విజయమూ అందుకుంటూ ఉంటారు. ఇప్పుడు జాన్వీ (Janhvi Kapoor)కూడా ఇదే పని చేసింది. అంతేకాదు తొలి ప్రయత్నం టీజర్‌తోనే మెప్పించింది అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఆలియా భట్‌ను ఫాలో అవుతూ ఆమె చేసిన ఈ కొత్త ప్రయత్నమే ‘ఉలజ్‌’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ప్రచార వీడియో ఇటీవల రిలీజ్‌ చేశారు.

అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. ఇండస్ట్రీలోకి ఏడు సంవత్సరాల అయినా తల్లి స్థాయిలో సినిమాల విజయాలు జాన్వీకి దక్కలేదు. అయితే అందం విషయంలో, ఆకర్షణ విషయంలో తల్లి కంటే ఓ అడుగు ముందే ఉంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు ఆమె కూడా ఎదురుచూస్తుండగా… రెండు సినిమాలు ఓకే చేసి వావ్‌ అనిపించింది. అయితే ఆ రెండూ కమర్షియల్ రోల్సే.

కానీ బాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమా పూర్తిగా విరుద్ధం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ రోల్‌లో జాన్వీ అదరగొట్టేసింది అని చెప్పాలి. ‘ఉలజ్‌’ టీజర్‌లో సినిమా కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పారు. విదేశీ రాయబారిగా ఇతర దేశానికి వెళ్లిన అమ్మాయి అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునే క్రమంలో ప్రమాదంలో పడుతుంది. రహస్య గూఢచారి కావడంతో భారత ప్రభుత్వం నుండి మద్దతు కూడా ఉండదు. ఈ సమయంలో ఆమె ఏం చేసింది అనేదే కథ.

ఈ పాయింట్‌ వింటే గతంలో ఆలియా భట్‌ (Alia Bhatt) చేసిన ‘రాజీ’ సినిమా గుర్తొస్తుంది. అయితే దర్శకుడు సుధాన్షు సరియా సినిమాను సరికొత్తగా చూపించబోతున్నారు అని టీమ్‌ అంటోంది. ‘రాజీ’లో సీక్రెట్ ఏజెంట్‌గా అలియా అదిరిపోయే పర్ఫార్మన్స్ ఇచ్చి… కమర్షియల్ సక్సెస్‌తో పాటు బోలెడన్ని అవార్డులు గెలుచుకుంది. మరిప్పుడు అలాంటి కథతోనే వస్తున్న జాన్వీ కపూర్‌ ఇంకెన్ని పురస్కారాలు దక్కించుకుంటుందో చూడాలి. ఇక వసూళ్ల సంగతి అంటారా బాలీవుడ్‌ సినిమా కథ ఓ అంచనా వేయలేం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus