బయోపిక్ లో నటించడానికి చాలా వర్కౌట్ చేస్తున్న జాన్వీ

శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమయ్యింది జాన్వీ కపూర్. హీరోయిన్ చేసిన మొదటి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ ‘దఢక్’ ‘ సినిమాతో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం జాన్వీ మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్ లో నటించబోతోంది. అయితే ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన జాన్వీ నటిస్తుందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని టాక్. వివరాల్లోకి వెళితే ఈ చిత్రంలో అంగద్ బేడీ నటించబోతున్నడని టాక్. సో అంగద్ బేడీ సరసన జాన్వీ నటించనుండడంతో ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. జాన్వీ ఈ చిత్రానికి సంబంధించి చాలా కష్టపడుతుంది. గుంజన్ సక్సేనా ఎదుర్కొన్న ఒడుదుకులని తెలుసుకునేందుకు చాలా ప్రత్నిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus