Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కొత్త సినిమా ఆల్‌మోస్ట్‌ ఫిక్స్‌.. ఫ్యాన్స్‌కి కిక్‌!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు తెలుగులో నటిస్తే బాగుండు, నటించాలి, నటించాల్సిందే, ఇంకెప్పుడు నటిస్తుంది, ఇంకెన్నాళ్లు వెయిట్‌ చేయాలి, మొన్నీమధ్య అన్నారు కదా.. ఇంకా లేదేంటి.. ఇలా ఎన్నో రకాల వార్తలు విని వినీ బోర్‌ కొట్టేసిన సమయంలో తారక్‌ 30వ సినిమాను అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో జాన్వీ నాయిక అనే విషయం తెలిసిందే. అయితే రెండో సినిమాకు ఇంకెంత టైమ్‌ పడుతుంది అనుకుంటుండగా.. రెండో సినిమా దాదాపు ఓకే అయిపోయింది అంటున్నారు.

అవును, మీరు చదివింది కరెక్టే.. జాన్వీ (Janhvi Kapoor) రెండో తెలుగు సినిమా దాదాపు ఓకే అయిపోయిందని సమాచారం. అది కూడా తొలి సినిమా చేస్తున్న హీరో మాజీ ఫ్రెండ్‌తోనే అని టాక్‌. రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో జాన్వీని కథానాయికగా ఎంచుకున్నారని సమాచారం. ఈ మేరకు ఇటీవల కథ వినిపించడం కూడా జరిగిపోయింది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉండొచ్చు అని చెబుతున్నారు. సినిమా ఎప్పుడు అనేది తెలియదు కాబట్టి.. హీరోయిన్‌ ఫైనల్‌ అని వార్త రావొచ్చు.

కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో పనుల్లో ఉంది. బుచ్చిబాబు సానా టీమ్‌ ప్రస్తుతం ఈ పనుల్లోనే ఉందట. మరోవైపు కాస్టింగ్ పనులు కూడా చూస్తున్నారట. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు జాన్వీ లాంటి హీరోయిన్‌ అయితే బాగుంటుందని టీమ్‌ అనుకుందట. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. ఒక హీరోయిన్‌గా జాన్వీ అయితే.. రెండో హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ అని అంటున్నారు.

ఇక మాజీ ఫ్రెండ్స్‌ అన్నాం కదా.. దాని సంగతి చూస్తే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారంలో చరణ్‌, తారక్‌ మధ్య కనిపించిన స్నేహం ఇప్పుడు కనిపించడం లేదు. పుట్టిన రోజు విషెష్‌ లేవు, సరదా పోస్ట్‌లు, ముచ్చట్లు కూడా లేవు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అంటున్నారు. దీంతోనే మాజీ స్నేహితులు అనాల్సి వస్తోంది. ఒకవేళ అదేం లేదు.. మేం స్నేహితులం అంటే.. అప్పుడు మాజీని కొట్టేయొచ్చు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus