Jani Master, Suma: సుమను పెళ్లి చేసుకుంటా అంటూ ప్రపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ సుమకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేరళకు చెందిన సుమ రాజీవ్ కనకాలని వివాహం చేసుకొని హైదరాబాదులో సెటిల్ అయ్యింది. సుమ మాతృభాష మలయాళం అయినా కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తున్న సుమకి పోటీగా ఎంతోమంది కొత్త యాంకర్లు వచ్చినా కూడా ఆమెకి పోటీగా నిలవలేక పోతున్నారు. ఎంతటి గ్లామరస్ యాంకర్ అయినా కూడా సుమా తర్వాతే అనేట్టుగా పాతుకుపోయింది.

ఇదిలా ఉండగా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలంగా ప్రసారమైన ఈ షో ప్రసారాన్ని ఇటీవల నిలిపివేశారు. ఈ క్యాష్ షో స్థానంలో “సుమా అడ్డా” అనే సరికొత్త షోని ప్రారంభించారు. క్యాష్ షో మాదిరిగానే ఈ షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ షో లో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షో కి పాల్గొనడంతో షో మంచి రేటింగ్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ఈ షోలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్లు అయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా అతిధులుగా పాల్గొన్నారు. ఇక ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ షోలో జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. వీరి ముగ్గురు మధ్య సంభాషణ చాలా సరదాగా ముఖ్యంగా వీరిద్దరి మీద సుమ వేసిన పంచులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.

ఇక ఈ ఎపిసోడ్లో శేఖర్ మాస్టర్ అమ్మాయిల పట్ల ఎంత సరదాగా ఉంటాడో అన్న విషయాన్ని ఒక స్కిట్ ద్వారా చూపించారు. అలాగే శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కి మధ్య ఉన్న ముద్దు సన్నివేశాన్ని కూడా స్క్రీన్ పై వేసి చూపించింది.ఇక ఈ షో లో జానీ మాస్టర్ సుమకి ప్రపోజ్ చేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రేమదేశం సినిమా స్కూఫ్ చేస్తూ అందులో భాగంగా జానీ మాస్టర్ సుమని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus