Jani Master: అలా మాట్లాడి ఆమె నమ్మించింది.. జానీ భార్య కామెంట్స్ వైరల్!

జానీ మాస్టర్ (Jani Master)  వివాదంలో ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకోగా రాబోయే రోజుల్లో ఈ వివాదం విషయంలో మరిన్ని మలుపులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్ భార్య తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆరోపణలు చేస్తున్న యువతి గురించి జానీ మాస్టర్ భార్య సుమలత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు యువతి గురించి సుమలత ఫిర్యాదు చేశారు.

Jani Master

బాధితురాలు అని చెప్పుకుంటున్న యువతి కొరియోగ్రాఫర్ ఛాన్స్ కోసం తన భర్తను ట్రాప్ చేసిందని ప్రేమ పేరుతో ఆమె వేధింపులకు గురి చేసిందని సుమలత పేర్కొన్నారు. సదరు యువతి గత ఐదేళ్లుగా నాకు నరకం అంటే ఏంటో చూపించిందని సుమలత చెప్పుకొచ్చారు. ఆమె వల్ల నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆ యువతి జానీ మాస్టర్ పై వేధింపులకు పాల్పడిందని సుమలత పేర్కొన్నారు.

జానీ మాస్టర్ మా ఇంటికి సైతం రాకుండా ఆ యువతి అడ్దుకునేదని రోజుకు 2 నుంచి 3 గంటలు మాత్రమే జానీ మాస్టర్ ను ఇంటికి పంపేదని ఆమె తెలిపారు. ఆ యువతితో జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే ఆయన లైఫ్ నుంచి వెళ్లిపోతానని చెప్పానని సుమలత చెప్పుకొచ్చారు. ఆ యువతి మాత్రం జానీ మాస్టర్ తనకు అన్నయ్యలాంటి వ్యక్తి అని మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని సుమలత పేర్కొన్నారు.

సుమలత చేసిన ఆరోపణల గురించి బాధితురాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ వివాదం విషయంలో రాబోయే రోజుల్లో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సుమలత మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదం విషయంలో తన వంతు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలైతే ఈ వివాదం గురించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

దేవర సినిమా తుది ఫలితాన్ని సోమవారం కలెక్షన్లు డిసైడ్ చేస్తాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus