సుధీర్ బాబు హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబు చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అయినప్పటికీ ‘కొత్తగా ట్రై చేస్తాడు’ అనే నమ్మకం అతనిపై ఉంది. దీనివల్ల హిట్టు ప్లాప్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేయగలుగుతున్నాడు. ఇక సుధీర్ బాబు నెక్స్ట్ మూవీ ‘జటాధర’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక మైథలాజికల్ టచ్ ఉన్న హారర్ మూవీ. తాజాగా ట్రైలర్ ను మహేష్ బాబు లాంచ్ చేశారు.
‘జటాధర’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల నిడివి కలిగి ఉంది. పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి.. మంత్ర తంత్రాలతో బంధనం వేసేవారు, అందులో పిశాచ బంధనం కూడా ఒకటని సినిమా కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. ఆ వెంటనే హీరో పాత్ర ఎంట్రీ. దెయ్యాలపై నమ్మకం లేకపోయినా గోస్ట్ హంటింగ్ చేసి దెయ్యాలు,బూతులు లేవు అని జనాలకు తెలపడమే లక్ష్యం కలిగిన వ్యక్తిగా హీరో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. మరోపక్క సోనాక్షి సిన్హా ధన పిశాచిగా కనిపిస్తుంది.
అలాగే మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఆమె పాత్రలో గ్రే షేడ్స్ కనిపిస్తున్నాయి. ట్రైలర్ చివర్లో పరమేశ్వరుడుని కూడా దించారు. బహుశా హిందీ మార్కెట్ కోసం అనుకుంట. చివర్లో సుధీర్ బాబు నేల పై పడి ఉన్న రక్తాన్ని తాగుతున్నట్టు ఓ విజువల్ ఉంది. అది టెరిఫిక్ గా అనిపిస్తుంది. ట్రైలర్లో కథ మొత్తం చెప్పేసి.. ‘జటాధర’ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి: