‘బాహుబలి’ లాంటి సినిమాను ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా బీట్ చేయడమేంటి అనుకుంటున్నారా..? నిజంగానే బీట్ చేసిందండి. ఎలా అంటే.. హైదరాబాద్ లో సినిమా థియేటర్ల హబ్ గా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొదటి వారంలో భారీ వసూళ్లను సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2017లో విడుదలైన ‘బాహుబలి’ రెండో భాగం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో తొలివారంలో రూ.36 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అప్పటికి అదే పెద్ద రికార్డ్.
ఈ రికార్డ్ ను ‘అల వైకుంఠపురములో’ సినిమా బీట్ చేసి రూ.40.83 లక్షల గ్రాస్ సాధించి అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూ.40.76 లక్షలు కొల్లగొట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ సినిమా తొలివారంలో రూ.38.63 లక్షల గ్రాస్ సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ‘బాహుబలి’ నాల్గో స్థానంలో, ‘మహర్షి’ ఐదో స్థానంలో నిలిచింది. నిజానికి ఈ టాప్ 5 లో ఉన్న సినిమాలన్నీ కూడా టాప్ హీరోలు నటించినవి.
పైగా అన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు.. ఒక్క ‘జాతిరత్నాలు’ తప్ప. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతిరత్నాలు’ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టి టాప్ 5 లో నిలవడం విశేషమనే చెప్పాలి. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను అనుదీప్ డైరెక్ట్ చేశాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండో వారం కూడా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతోంది.
Click Here To Read Movie Review
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!