చిన్న సినిమానే అయినా.. బిజినెస్ బాగానే చేస్తుందిగా..!

న‌వీన్ పోలిశెట్టి హీరోగా ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘జాతి రత్నాలు’ . రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి వంటి స్టార్ కమెడియన్స్ టైటిల్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని ‘స్వ‌ప్న సినిమా’ బ్యాన‌ర్ ‌పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. చిన్న సినిమా కదా అని.. మొన్నటివరకూ ‘జాతి రత్నాలు’ చిత్రాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవల విడుదలైన ‘చిట్టి నీ నవ్వంటే’ అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో సినిమా అలాగే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

దాంతో ఈ చిత్రానికి ఇప్పుడు బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది అనేది ట్రేడ్ పండితుల సమాచారం. వారి సమాచారం ప్రకారం.. ‘జాతి రత్నాలు’ చిత్రాన్ని రూ.6కోట్ల లోపే ఫినిష్ చేసాడట నాగ్ అశ్విన్. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే.. ఆంధ్రలో ఈ చిత్రానికి రూ.8కోట్ల వరకూ బిజినెస్ జరుగుతుందట. ఇక తెలంగాణలో రూ.4కోట్ల వరకూ జరుగుతుందని వినికిడి. మిగిలిన ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఎలా చూసుకున్న థియేట్రికల్ రైట్స్ పరంగానే ఈ చిత్రం రూ.12 కోట్లను రాబట్టింది కాబట్టి.. డబుల్ ప్రాఫిట్స్ అన్న మాట. ఇంకా డిజిటల్ మరియు శాటిలైట్ ఇంకా హిందీ డబ్బింగ్ హక్కులు మిగిలున్నాయి కాబట్టి.. సినిమా విడుదలయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంటే కనుక.. నిర్మాతకు భారీ లాభాలు దక్కినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!>

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus