పిట్టగోడ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయమైన కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా గత నెల 11వ తేదీన శివరాత్రి పండుగ కానుకగా థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు పోటీగా శ్రీకారం, గాలిసంపత్ సినిమాలు రిలీజ్ కాగా జాతిరత్నాలు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. మిగిలిన రెండు సినిమాలలో గాలిసంపత్ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటే శ్రీకారం యావరేజ్ గా నిలిచింది.
నితిన్ హీరోగా తెరకెక్కిన రంగ్ దే సినిమా రిలీజయ్యే వరకు జాతిరత్నాలు సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న జాతిరత్నాలు ఈ నెల 11వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 39 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన జాతిరత్నాలు సినిమాకు ఓటీటీలో మాత్రం ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ పెద్దగా లేదని తెలుస్తోంది. ఓటీటీలో జాతిరత్నాలు సినిమాను చూసిన చాలామంది ప్రేక్షకులు జాతిరత్నాలు సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయిందో తమకు అర్థం కావడం లేదని కామెంట్లు పెడుతున్నారు.
మరి కొందరు ప్రేక్షకులు ఈ సినిమా తమకు నచ్చలేదని అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలలో హిట్ అనిపించుకుంటుంటే జాతిరత్నాలు సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతుండటం గమనార్హం. జాతిరత్నాలు సినిమాకు ఓటీటీలో నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ఉప్పెన సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈరోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!