‘జాతిరత్నాలు’ నూడుల్స్‌ ట్విస్ట్‌ మీమ్‌ అయితే…

సినిమా పోస్టర్ల మీద, ట్రైలర్లు.. టీజర్ల మీద మీమ్స్‌ రావడం పెద్ద విషయమేమీ కాదు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించి మీమ్స్‌ చేస్తున్నారు మన మీమర్స్‌. అయితే ఆ ట్రెండ్‌ను కొత్త పుంతలు తొక్కించారు మెగాస్టార్‌ చిరంజీవి. తన మీద తనే మీమ్ చేయించి ట్రెండింగ్‌లో నిలిచారు. ఇప్పుడు ‘జాతిరత్నాలు’ సినిమా టీమ్‌ ఏకంగా మీమ్‌ వీడియోను రూపొందించింది. తాజాగా ఆ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలోకి కీలక పాయింట్‌ ఆధారంగా ఈ మీమ్‌ వీడియో రూపొందించారు.

‘జాతిరత్నాలు’ సినిమా చూసినవాళ్లకు ఈ మీమ్‌ వీడియో చాలా సులభంగా అర్థమై నవ్వొస్తుంది. సినిమా చూడని వారికైతే ఇది కాస్త అర్థంకాకపోవచ్చు కానీ నవ్వు అయితే వస్తుంది. సినిమాలోని ‘నూడుల్స్‌’ ట్విస్ట్‌ను నేపథ్యంగా తీసుకొని, తెలుగు హిట్‌ సినిమాల సీన్లకు ఆపాదించి మీమ్స్‌ సిద్ధం చేశారు. దానిని వీడియోగా సిద్ధం చేసి లాంచ్‌ చేశారు. సోషల్‌ మీడియాను ఈసినిమా ఉపయోగించుకుంటున్న తీరు అయితే.. చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇంతలా సోషల్‌ మీడియాను సినిమా కోసం వాడొచ్చా అని అందరూ అనుకునే స్థాయికి వెళ్లింది.

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. అనుదీప్‌ దర్శకుడు. నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. దేశ విదేశాల్లో మంచి వసూళ్లు అందుకుంటూ సినిమా ముందుకుసాగుతోంది. ఇలాంటి ప్రచారం చేసి.. ఆ జోరును మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది చిత్రబృందం.


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus