Jaya Bachchan: జయాబచ్చన్ పై నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే..?

నేడు అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జయాబచ్చన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిషేక్ బచ్చన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు చాలా సంవత్సరాల క్రితం జయాబచ్చన్ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిషేక్ తన పోస్ట్ లో “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.. ఐ లవ్యూ” అని పేర్కొన్నారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జయాబచ్చన్ కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే పుట్టినరోజు వేళ జయాబచ్చన్ ను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. జయాబచ్చన్ కు అహంకారమని, పొగరని నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమె చేసిన చిన్న తప్పు వల్ల నెటిజన్లు ఆమెపై సీరియస్ అవుతున్నారు. నెటిజన్లు జయాబచ్చన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి ముఖ్యమైన కారణం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

సీఎం మమతా బెనర్జీకి మద్దతుగా జయాబచ్చన్ హౌరాలో నిన్న రోడ్ షో నిర్వహించారు. జయాబచ్చన్ వాహనంలో ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఆమెతో సెల్ఫీ దిగాలని భావించి ప్రయత్నించగా జయాబచ్చన్ అతని చేతిని తన చేతితో కిందికి పెట్టారు. జయాబచ్చన్ అలా చేయడంతో ఆమెకు పొగరు అని నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.


Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus