కృష్ణాష్టమి, స్వాతంత్ర దినోత్సవం సెలవలు కలిసి రావడంతో ఆగష్టు 11న మూడు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో బెల్లం కొండ శ్రీనివాస్ చిత్రం జయ జానకి నాయకకి థియేటర్లు తక్కువగా దొరికాయి. కానీ నితిన్, రానా సినిమాల కంటే శ్రీనివాస్ నటించిన సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీ, సీ సెంటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబట్టింది. తక్కువ థియేటర్స్ కావడంతో టికెట్స్ కోసం ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితిని గమనించిన చిత్రం బృందం రెండో వారం వరకు ఆగింది.
నిన్న (శుక్రవారం) ఆనందో బ్రహ్మ తప్ప ఏ తెలుగు మూవీ రిలీజ్ కాలేదు. దీంతో థియేటర్స్ దొరికాయ్. జయ జానకి నాయకకు 100 స్క్రీన్ లు పెంచారు. లై మొదటి వారంలోనే డీలా పడిపోగా, నేనేరాజు నేనే మంత్రి కలక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నాయి. పోటీ సినిమా ప్రభావం తగ్గడం, గట్టి పోటీ ఇచ్చే సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడం అనే అంశాలు జయ జానకి నాయక చిత్రానికి కలిసొచ్చాయి. భారీ కలక్షన్స్ రాబట్టే అవకాశం దొరికింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.