బుల్లితెర పై నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క ప్రతీ సినిమా వేడుకలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్న సుమ కనకాల తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. గతంలో సుమ ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ ‘పవిత్ర ప్రేమ’ ‘వర్షం’ ‘బాద్ షా’ ‘రావోయి చందమామ’ ‘స్వరాభిషేకం’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే కొంచెం గ్యాప్ తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మూవీలో సుమతో పాటు దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ‘వెన్నెల క్రియేషన్స్’ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రాన్ని విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించాడు.మే 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది. సుమకి ఉన్న క్రేజ్ తో ఈ మూవీకి ఓ మోస్తారు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలను గమనిస్తే :
నైజాం | 1.50 cr |
సీడెడ్ | 0.50 cr |
ఉత్తరాంధ్ర | 0.60 cr |
ఈస్ట్ | 0.12 cr |
వెస్ట్ | 0.10 cr |
గుంటూరు | 0.18 cr |
కృష్ణా | 0.15 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.20 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.45 cr |
‘జయమ్మ పంచాయితీ’ చిత్రానికి రూ.3.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. అందరి స్టార్ హీరోలతో ప్రమోషన్ చేయించడం వలన ఈ మూవీకి బాగానే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే టార్గెట్ ను అందుకోవడం అంత ఈజీ కాదు. పోటీగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘భళా తందనాన’ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు ప్రేక్షకులకి పెద్ద సినిమాల ఎలాగూ ఆప్షన్ గా ఉన్నాయి.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!