కొత్తవాళ్లతో స్టార్ డైరెక్టర్ సినిమా

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించిన దర్శకుడాయన. 20 సంవత్సారాల కెరీర్ లో పదకొండు సినిమాలే చేసిన ఈ దర్శకుడి ఖాతాలో కొంత కాలంగా సరైన హిట్ పడలేదు. అతడే జయంత్ సి పరాన్జీ. రెండేళ్ల క్రితం పునీత్ రాజ్ కుమార్ హీరోగా తన చివరి సినిమా చేసిన ఆయన ప్రస్తుతం కొత్తవారితో ఓ సినిమా చేయనున్నారు.

‘ఉగ్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాతో నిలీష్, ఇసబెల్‌ లను పరాన్జీ హీరో, హీరోయిన్లుగా పరిచయం చేయనున్నారు. ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇదిలా ఉంటే మంత్రి గంటా తనయుడు హీరోగా ‘కాళహస్తి’ పేరుతో జయంత్ ఓ సినిమా మొదలెట్టారు. అది ఆదిలోనే అటకెక్కినట్టుంది. అయితే ఆ స్క్రిప్ట్ నే ‘ఉగ్రం’గా మార్చారా లేక ఇదే వేరే కథ అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈయన కొత్తవారితో చేయడం వెనక కారణమేమిటన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus