2002 వ సంవత్సరం నవంబర్ 11 న విడుదలైన ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ విలన్ అయిన కొల్లా అశోక్ కుమార్ నిర్మించాడు. ఈ చిత్రం సో సో గా ఆడింది. ప్రభాస్ కు రావాల్సిన గుర్తింపు అయితే ఈ చిత్రంతో రాలేదు. కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కు గ్రాండ్ లాంచింగ్ అయితే దొరకలేదు అనే చెప్పాలి. అయితే ప్రభాస్ ను లాంచ్ చెయ్యడానికి మొదట అనుకున్న దర్శకుడు జయంత్ కాదు.. ఆ అవకాశం మరో స్టార్ డైరెక్టర్ కు వచ్చింది.
కానీ అతనికి కుదరకపోవడంతో జయంత్.. ప్రభాస్ ను లాంచ్ చేసాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు మన కె.రాఘవేంద్ర రావు గారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారు కూడా నిర్మాతే అన్న సంగతి తెలిసిందే. కె.రాఘవేంద్ర రావు గారు కృష్ణంరాజుతో తెరకెక్కించిన ‘అమరదీపం’ ‘మధుర స్వప్నం’ ‘త్రిశూలం’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ వంటి చిత్రాలను సూర్యనారాయణ రాజుగారే నిర్మించారు. ఇక ప్రభాస్ పెద్దయ్యాక హీరో అవ్వడానికి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ఆ టైములో ‘మా అబ్బాయిని హీరోగా లాంచ్ చెయ్యాలి’ అని కె.రాఘవేంద్ర రావు గారిని సూర్య నారాయణ రాజు గారు కోరారట.
ఆ ప్రాజెక్టుని కూడా ఆయనే నిర్మిస్తాను అని చెప్పారట. కానీ అప్పుడు రాఘవేంద్ర రావుగారు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ప్రభాస్ ను లాంచ్ చెయ్యడం కుదరలేదట.దాంతో ఆ అవకాశం జయంత్ కు దక్కింది. ఒకవేళ రాఘవేంద్ర రావుగారు కనుక లాంచ్ చేసి ఉండి ఉంటే..వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున లా.. మొదట్లోనే ప్రభాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి ఉండేది. అయినప్పటికీ తన సొంత ట్యాలెంట్ తో ఈరోజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగాడు.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!