పాకిస్థాన్ లో సినిమా తీసేందుకు స్టార్ డైరక్టర్ ప్లాన్

  • June 27, 2018 / 10:25 AM IST

ఒకప్పుడు భారీ హిట్స్ అందుకున్న డైరక్టర్ జయంత్ సి పరాన్జీ. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, శంకర్ దాదా M.B.B.S , లక్ష్మి నరసింహా వంటి ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. రాయల సీమ నేపథ్యంలో ప్రేమకథలకు శ్రీకారం చుట్టి ట్రెండ్ సృష్టించారు. కానీ సఖియా, అల్లరి పిడుగు, తీన్మార్ … ఈ మూడు వరుసగా ఫెయిల్ కావడంతో స్టార్ హీరోలు అతనితో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఆయన కొత్త హీరోతో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నీలేష్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు.

ఈషాన్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘నరేంద్ర’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా కథానాయికగా ‘లాజా బెల్లె’ పరిచయం కానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని సమాచారం. కథా పరంగా కొన్ని సన్నివేశాలను పాకిస్థాన్ లోను చిత్రీకరించవలసి ఉంటుందని తెలిసింది. అందుకే చిత్ర బృందం పాకిస్థాన్ లో అందమైన ప్రదేశాలను వెతికే పనిలో పడ్డారు. అలాగే అనుమతుల విషయంలోను తిరుగుతున్నారు. పాకిస్థాన్ కి మనకి ఉన్న వైరం తెలిసిందే. కాశ్మిర్ లో సినిమా తీయడానికే దర్శకనిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది పాకిస్థాన్ లో ప్లాన్ చేసి జయంత్ సి పరాన్జీ పెద్ద సాహసమే చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus