మహాతల్లికి క్యారక్టర్ డిజైన్.. స్టోరీ డెవలప్ మెంట్ అవసరం లేదు. కాన్ఫ్లిక్ట్ లు, భారీ క్లైమాక్స్ జోలికి వెళ్ళదు. అయినా తన బుజ్జి ఫిలిం తో చివరి వరకు ఎలా ఎంజాయ్ చేయించాలో తెలుసు. యువత ఎదుర్కొనే చిన్న అంశాలను చక్కగా తెర పైన చూపించి నవ్వులు పూయించే మహాతల్లి ఈ బుధవారం ” జీతాలు కష్టాలు ” అనే వీడియోతో మన ముందుకు వచ్చేసింది.
జీతం ఎంత వస్తుంది అనేది ముఖ్యం కాదు.. చివరి వారంలో మన దగ్గర ఎంత ఉన్నదే పాయింట్. చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టాలని జాబ్ చేసే ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ పాటించడమే కష్టం. నెలాఖరులో ఖర్చులకి ఎంత ఇబ్బంది పడినా.. అకౌంట్ లోకి శాలరీ పడగానే కష్టాలన్నీ ఎగిరిపోతాయి. డబ్బులను నీళ్లలా ఖర్చు పెట్టేస్తాం. మంత్ ఫస్ట్, లాస్ట్ వారంలో జీతగాళ్లు ఉండే విధానాన్ని తీసుకుని మహాతల్లి చేసిన ప్రయత్నం శెభాష్ అనిపించుకుంటోంది. మీరు కూడా “జీతాలు కష్టాలు” చూసి మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.