రాజశేఖర్ గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం : జీవిత

  • January 2, 2020 / 04:24 PM IST

తాజాగా పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ వేడుక రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, కృష్ణంరాజు, మోహన్ బాబు, సుబ్బిరామిరెడ్డి వంటి వారు హాజరయ్యారు. అయితే డైరీ ఆవిష్కరణ అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ను వ్యతిరేకిస్తూ రాజశేఖర్ చేసిన కామెంట్స్ పెద్ద సంచలనం సృష్టించాయి. చిరంజీవి ‘మా’ అసోసియేషన్ అభివృద్ధికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా కలిసిగుట్టుగా పనిచేద్దాం అని చెప్పారు. అయితే చిరు మాటలను తప్పుగా అర్ధం చేసుకున్న రాజశేఖర్ స్టేజి పైన కాస్త తప్పుగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు.

‘ఇండస్ట్రీలో నిప్పు రాజుకుంటుందని.. కప్పి పెడితే నిప్పు దాగదని రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపే విధంగా ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాను అనుకున్నది చెప్పేసి రాజశేఖర్ బయటకి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో చిరంజీవి ఫైర్ అయ్యారు. రాజశేఖర్ తీరు పై తగిన యాక్షన్ తీసుకోవాలని డిసిప్లినరీ కమిషన్ ను కోరారు చిరంజీవి. ఇక ఈ క్రమంలో జీవిత పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ‘చిరంజీవి గారు ‘మా’ కు ఎంతో సాయం చేశారు. మా అభివృద్ధికి ఎన్నో సలహాలు ఇచ్చారు.. వారి నుండి ఎంతో నేర్చుకున్నాము. ప్రతీ చోటా విభేదాలు అనేవి ఉంటాయి.

మనుషులు అన్నాక ఇలాంటి ఇష్యూలు వస్తూనే ఉంటాయి. రాజశేఖర్ గారిది చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఆయన మనసులో ఏముంటే అది మాట్లాడేస్తారు. అందుకు సారి. చిరంజీవి సార్.. ‘మాకు మీద గౌరవం ఎప్పటికీపోదు’. ‘మా’ని అభివృద్ధి పరచడమే మా కల. ప్రస్తుతం ‘మా’లో ఎవరికి ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు. రాజశేఖర్ గారు ఎమోషనల్ అయ్యారు.. అందరం కలిసే పని చేస్తాము.. మీరు ముందుండి నడిపించండి. మేము అన్నీ సాధిస్తాము’… అంటూ చిరంజీవిగారిని కోరారు జీవిత.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus