దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్న శ్రీదేవి కూతురు

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి తన తొలి సినిమా “దఢక్”తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. జాన్వి నటనను విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం తొలిరోజున దేశవ్యాప్తంగా 8.71 కోట్లు రాబట్టగా, మూడు రోజుల్లో 33.67 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. తొలి అడుగు విజయవంతంకావడంతో జాన్వీకి సహజంగానే ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే జాన్వీ మాత్రం తన తల్లికి వీరాభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణాదిన సినిమా చేయాలనీ ఆశపడుతోందని సమాచారం.

వాస్తవానికి తెలుగులోనే జాన్వీ ని ఎంట్రీ ఇవ్వాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేశారు. బోనీ కపూర్ మాత్రం బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ కావడంతో వెనక్కి తగ్గారు. అక్కడ ఎంట్రీ సక్సస్ కావడంతో.. ఇక్కడ పరిచయం చేయడానికి బోనీ కథలను పరిశీలిస్తున్నారు. కథ మాత్రమే కాదు, డైరక్టర్, నిర్మాణ సంస్థ, హీరో కూడా ముఖ్యమని ఆలోచిస్తున్నారు. మరి జాన్వి తెలుగులో ముందు అడుగుపెడుతుందా? లేకుంటే తమిళంలో పరిచయం కాబోతుందా? అనేది సస్పెన్స్. రెండు పరిశ్రమలో పేరున్న హీరోతో ద్విభాషా చిత్రం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus