Jigra Twitter Review: అలియా భట్ ‘జిగ్రా’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..ఎలా ఉందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘జిగ్రా’ (JIGRA) . వాసన్ బాలా (Vasan Bala) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘ధర్మ ప్రొడక్షన్స్’ ‘ఇటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్’ సంస్థలపై కరణ్ జోహార్ (Karan Johar)  , అపూర్వ మెహత (Apoorva Mehta), అలియా భట్, షహీన్ భట్ (Shaheen Bhatt), సౌమెన్ మిశ్రా..లు కలిసి నిర్మించారు. అక్టోబర్ 11 న అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని రానా రిలీజ్ చేస్తున్నారు. ‘కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే రానా (Rana) రిలీజ్ చేస్తాడు’ అనే నమ్మకం అయితే జనాల్లో ఉంది.

Jigra Twitter Review

‘జిగ్రా’ ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో దీనిపై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు కుటుంబాన్ని కోల్పోయిన సత్య ఆనంద్ (అలియా భట్).. తనకు మిగిలిన తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదంగ్ రైనా) సర్వస్వంగా జీవిస్తుంటుంది. అయితే ఊహించని విధంగా అతను జైలు పాలవ్వడం, అక్కడ అతను చిత్ర హింసలకు గురవ్వడం..తో సత్య తన తమ్ముడిని కాపాడుకోవడానికి బయల్దేరుతుంది.

ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ‘జిగ్రా’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందట. మెయిన్ పాయింట్ కి వెళ్ళాక అందరిలో ఆసక్తి పెరుగుతుంది అని అంటున్నారు. సెకండాఫ్ లో అలియా భట్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలరిస్తాయని అంటున్నారు. సినిమాలో ఆమె వన్ మెన్ షో చేసినట్లు తెలుస్తుంది. మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

‘మార్టిన్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus