నితిన్‌ సినిమా ఛాన్స్‌ కొట్టేసిన జిత్తు

కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడంలో, అందులోనూ కొత్త డ్యాన్స్‌ మాస్టర్లకు అవకాశం ఇవ్వడంలో మన టాలీవుడ్‌ హీరోలు ఎప్పుడూ ముందుంటారని అంటుంటారు. అందులో నితిన్‌ కూడా ఉన్నాడు. అలా నితిన్‌ టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్‌ చేసిన డ్యాన్స్‌ మాస్టర్లలో టాప్‌ ప్లేస్‌కి వచ్చిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. ఇప్పుడు నితిన్‌ మరో మాస్టర్‌కి ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడు. ఈసారి ఆ ఛాన్స్‌ సాధించింది జిత్తు మాస్టర్‌. ఇటీవల ఓ టీవీ షోకి వచ్చిన నితిన్‌ ఈ మేరకు ప్రామిస్‌ చేశాడు.

హోళీ సందర్భంగా ఈటీవీలో ‘రంగు పడుద్ది’ అనే ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. దీనికి నితిన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిత్తు మాస్టర్‌ ఓ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. పవన్‌ కల్యాణ్‌ ‘తొలి ప్రేమ’ సినిమాలోని ‘ఉన్‌ దోస్‌ త్రేస్‌…’ అనే పాటకు తన టీమ్‌తో డ్యాన్స్‌ చేసి అలరించాడు జిత్తు. డ్యాన్స్‌ వేస్తున్నంతసేపు ఎంజాయ్‌ చేసిన నితిన్‌.. ఆ తర్వాత అతని టీమ్‌తో కలసి చిన్న స్టెప్పు వేశాడు. ఆ తర్వాత ‘నీ డ్యాన్స్‌ చాలా నచ్చింది… త్వరలో నీతో కలసి పని చేస్తా’ అని చెప్పాడు.

‘నీ మొదటి సాంగ్‌ నాతోనే..’ అంటూ ప్రకటించేశాడు కూడా నితిన్‌. ‘ద్రోణ’ సినిమాలో జానీ మాస్టర్‌కి నితిన్‌ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జానీ మాస్టర్‌ ఏ రేంజికి వెళ్లాడో అందరూ చూశారు. ఇప్పుడు జిత్తుకు అలానే అవకాశం ఇస్తున్నారు. మరి తర్వాతి రోజుల్లో జిత్తు ఎలా ఎదుగుతాడో చూడాలి. ఈ సమయంలో ఓ విషయం గుర్తు చేసుకోవాలి. ‘ఢీ’ షోలో శేఖర్‌ మాస్టర్‌ ఎప్పుడూ చెప్పే మాట ఒకటుంది. ‘ఇక్కడేస్తున్న స్టెప్పులు, వేయిస్తున్న స్టెప్పులు పెద్ద హీరోతో వేయిస్తే దుమ్ము రేగిపోతుంది’ అంటూ శేఖర్‌ మాస్టర్‌ అనేవారు. ఇప్పుడు ఆ అవకాశం వస్తోంది జిత్తు మాస్టర్‌.. ఇక మీరే చూసుకోవాలి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus