టాలీవుడ్ యువ హీరోల్లో రానా ఒకడు, అయితే కేవలం హీరోగానే కాకుండా అటు విలన్ గా సైతం రానా నటిస్తూ దూసుకెళ్తున్నాడు. అదే క్రమంలో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రానా నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ ఇప్పుడు సినిమా వర్గాల్లోనే కాదు, అటు పొలిటికల్ గా కూడా హీట్ ని పుట్టిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు రానా చేస్తున్న యువ ఘర్జన చూస్తూ ఉంటే, నిజంగానే యువ ఘర్జన జరుగుతుందా అన్న ఆలోచనలు కలుగుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే….రానా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ ప్రమోషన్ కు సంబంధించి ఈరోజు రాణా యువఘర్జనకు పిలుపునిచ్చాడు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఎమ్.ఎల్.ఏ కాలనీలోని లోటస్ పాండ్ వద్ద గల ఆర్.ఎస్.ఆర్ ఆడిటోరియంలో ‘జోగెంద్ర యువ గర్జన’ పేరుతో ఏర్పాటు చేసిన సభకు కుటుంబ సభ్యులతో రమ్మని అందరినీ ఆహ్వానిస్తూ తెలిపాడు.
అయితే ఎందుకు ఈ యువ గర్జన అంటే ఈమూవీ వచ్చే వారం విడుదల అవుతున్న నేపధ్యంలో ఈసినిమా ప్రమోషన్ ను ఈ యువ గర్జన నుండి మొదలు పెడుతున్నారు అట. అయితే ప్రమోషన్స్ లో కొత్త దారులు వెతుకుతున్న ఈ రోజుల్లో సినిమాని ఇలా కూడా ప్రమోట్ చెయ్యవచ్చు అని ఈ పద్దతి చాలా వెరైటీ గా ఉంది అంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు, మొత్తాంగ చూసుకుంటే ఈ సినిమాతో రాణా మంచి పేరు తెచ్చుకుంటాడు అని అర్ధం అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.