John Abraham: జాన్‌ అబ్రహమ్‌ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి?

నోరా వీపునకు చేటు చేయకే… అని పెద్దలు చెబుతుండేవారు గుర్తుందా? దాన్ని ఇప్పటికి ట్రెండ్‌కు తగ్గట్టుగా చెప్పుకుంటే అందులోనూ సినిమా వాళ్లకు ఆపాదించి చెప్పుకుంటే ‘నోరా కెరీర్‌ను ముంచేయకే’ అనొచ్చు. తాజాగా ఈ మాట బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహమ్‌కి బాగా సరిపోతుంది. ‘తెలుగులో నటిస్తున్నారా?’ అని అడిగితే ఏవేవో మాట్లాడేసి, నెటిజన్ల కోపం చవి చూశాడు జాన్‌ అబ్రహమ్‌. ఇప్పుడు తన సినిమా వసూళ్లు లేక మరోసారి మాటలు పడుతున్నాడు.

Click Here To Watch NOW

‘సలార్‌’ సినిమాలో జాన్‌ అబ్రహం నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై క్లారిటీ ఎలా అని అనుకుంటుండగా… అతను నటించిన ‘ఎటాక్‌’ సినిమా ప్రచారం మొదలైంది. అలా జాన్‌ బయటికొచ్చాడు కదా అని ‘సలార్‌’ ముచ్చట అడిగేశారు. దానికి ఆయన ‘నేను బాలీవుడ్‌ హీరోను. రీజనల్‌ సినిమాల్లో నటించను. డబ్బు కోసం అక్కడ సెకండరీ పాత్రలు చేయను’ అంటూ ఏవేవో మాట్లాడేశాడు. సినిమా విడుదలకు ముందు ఇలా అనడంతో ఆ ఫలితం రాని చూద్దాం అనుకున్నారు టాలీవుడ్‌ ఫ్యాన్స్‌.

‘ఎటాక్‌’ విడుదలైంది… బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వారం తర్వాతి వసూళ్లు, ‘ఎటాక్‌’ తొలి రోజు వసూళ్లు కంటే ఎక్కువగా వచ్చాయి. దీంతో అంతన్నాడు, ఇంతన్నాడు ఇలా అయిపోయాడేంటి అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. లెక్క చెప్పలేదు కదా ‘ఎటాక్‌’ తొలి రోజు దేశ‌వ్యాప్తంగా రూ.3 కోట్ల నెట్ వ‌సూళ్లు మాత్ర‌మే రాబ‌ట్టిందట. అదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వారం దాటినా హిందీ వెర్షన్‌ సుమారు రూ. 10 కోట్లు వసూళ్లు సాధించిందని టాక్‌.

పోనీ ఈ సినిమానే తేడా చేసింది అనుకుందాం అంటే అంతకుముందు వచ్చిన ‘సత్యమేవ జయతే 2’ పరిస్థితీ ఇంతే. ఆ సినిమాలో జాన్‌ అబ్రహమ్‌ పాత్ర, కథ, కథనం… ఇలా అన్ని విషయాల్లో ఇబ్బందికరంగానే నిలిచింది. దీంతో ‘బాలీవుడ్‌ హీరోను నేను… హిట్‌ కొట్టలేను’ అంటూ సోషల్‌ మీడియాలో నినాదాలు కనిపిస్తున్నాయి. ఇదే ‘నోరా కెరీర్‌కు చేటు చేయకే’ అంటే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus