సినిమాలో హీరోయిజం పండాలంటే… విలన్ బలవంతుడై ఉండాలి అంటారు. ఈ లాజిక్‌ను వదిలేసి చాలా సినిమాలు విజయం కోసం ప్రయత్నించి బొక్క బోర్లాపడుతుంటాయి. అయితే ప్రశాంత్ నీల్ ఆ తప్పు చేయలేదు. చేసినవి కొద్ది సినిమాలే అయినా… ప్రతి దాంట్లో బలమైన విలన్నే పెట్టుకుంటూ వచ్చారు. తాజాగా ‘సలార్’కి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారట. దాంతోపాటు తనదైన శైలిలో ఎక్కువమంది విలన్లను తీసుకొస్తున్నారట. మెయిన్ విలన్ కోసం బాలీవుడ్ హీరోను తీసుకొస్తున్నారని టాక్.
‘ధూమ్’ సిరీస్ మొదలైనప్పుడు జాన్ అబ్రహం విలనా.. అని అందరూ అనుకున్నారు. కానీ విలన్ లాంటి హీరో పాత్రను జాన్ అదరగొట్టేశాడు. ఆ జాన్ ఇప్పుడు ప్రభాస్‌తో తలపడబోతున్నాడు. అవును ‘సలార్’లో మెయిన్ విలన్ పాత్ర కోసం జాన్ అబ్రహమ్ను ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ సంప్రదించిందట. దీనికి ఆయన కూడా పాజిటివ్‌గానే స్పందించాడు అని తెలుస్తోంది. పాత్ర నచ్చితే నిడివి గురించి జాన్ పెద్దగా పట్టించుకోడు అంటారు. అలా ఇప్పుడు ‘సలార్’కి ఒప్పుకున్నాడట.
అయితే జాన్ అబ్రహం పాత్ర సినిమాలో ఎక్కువ సేపు ఉండదని టాక్. అంటే విలన్స్ బ్యాచ్/టీమ్‌ను లీడ్ చేసే మెయిన్ విలన్‌గా కేమియోలో కనిపిస్తాడని అంటున్నారు. అంటే సినిమా ఆఖరులో ఈ పాత్ర వస్తుందనుకోవచ్చు. జాన్ అబ్రహం కాబట్టి కచ్చితంగా ప్రభాస్‌తో ఫైట్ ఉంటుంది. మరి ఇద్దరు భారీ కటౌట్లు స్క్రీన్ మీద తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఈ ఎంపిక విషయంలో ఇంకో ఆలోచన కూడా ఉందనిపస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి… అక్కడి హీరో ఉంటే అదో క్కిక్కు… చూసినవాళ్లకే కాదు బిజినెస్‌కి కూడా.