వన్స్ ఏ హీరో.. ఆల్వేజ్ ఏ హీరో అని అంటుంటారు. అంటే ఒకసారి హీరో అయితే ఇక హీరోనే అని. అయితే ఈ మాట నుండి దూరంగా వచ్చిన చాలామంది మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మారారు. తమ పరిశ్రమలోనే కాకుండా.. ఇతర భాషల పరిశ్రమలోకి వెళ్లి కూడా విజయం అందుకున్నారు. అలా అని వారిని అక్కడా తక్కువగా చూడలేదు. సొంత పరిశ్రమలోనూ తక్కువగా చూడలేదు. కానీ అలాంటివారి మనసు చివుక్కుమనేలా మాట్లాడాడు జాన్ అబ్రహమ్.
డబ్బుల కోసం అలా నటించను అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రభాస్ ‘సలార్’ సినిమాలో జాన్ అబ్రహమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇరు వర్గాల నుండి క్లారిటీ లేదు. దీంతో ఆ మాట ఇటీవల జాన్ అబ్రహమ్ ముందుంచుంది మీడియా. దానికి ఆయన నేను నటించడం లేదనో, నో కామెంట్ అనో అంటే అయిపోయేది. అలా కాకుండా తాను బాలీవుడ్ హీరోనని రీజనల్ సినిమాల్లో నటించేదే లేదని తేల్చి చెప్పాడు.
ఎప్పటికీ ఇతర భాషల్లో సెకండ్ హీరోగా, సహ నటుడు పాత్రలు చేయనని చెప్పేశాడు. జాన్ అబ్రహమ్ రియాక్షన్ అక్కడితో ఆగలేదు. ఇతర నటుల్లా డబ్బు కోసం ఇతర భాషల్లో నటించే ప్రసక్తే లేదన్నాడు. దీంతో జాన్ వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలెందుకు అంత ఘాటుగా సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. పోనీలే బాలీవుడ్‌లో ఏమన్నా జాన్ పరిస్థితి అద్భుతంగా ఉంటే.. ఈ మాటలు అన్నాడంటే ఆ జోష్‌లో అన్నాడు అనుకోవచ్చు. మొన్నీమధ్య వచ్చిన ‘సత్యమేవ జయతే 2’ దారుణ పరాజయం పాలైంది.
పోనీ అక్కడేమన్నా అన్నీ హీరో వేషాలే వేస్తున్నాడా అంటే లేదనే చెప్పాలి. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు. అది హీరో పాత్ర కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటిది ఇప్పుడు ఇతర భాషల్లో నటిస్తున్న బాలీవుడ్ హీరోల గురించి అలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటో జాన్ అబ్రహమే చెప్పాలి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?