పెద్ద సినిమాల కలెక్షన్లకు ఎసరు పెట్టిన ‘జోకర్’

  • October 5, 2019 / 11:00 AM IST

నిన్న విడుదలైన పెద్ద సినిమాలు ‘సైరా’ ‘వార్’ లు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా నరసింహా రెడ్డి’ అలాగే హిందీ లో ‘వార్’ చిత్రాలు మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇక తెలుగులో ‘వార్’ అలాగే.. హిందీ లో ‘సైరా’ కి కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. రెండూ పెద్ద సినిమాలు కాబట్టి.. అందులోనూ దసరా సెలవులు కూడా ఉండడంతో తిరుగుండదని అంతా అనుంటున్న తరుణంలో ఓ చిత్రం మాత్రం ఈ రెండిటిని దెబ్బ కొట్టేలా ఉండనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

ఆ సినిమా మరేదో కాదు హాలీవుడ్ మూవీ ‘జోకర్’. చప్పుడు లేకుండా వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే చెన్నై వంటి ఏరియాల్లో ‘సైరా’ ‘వార్’ చిత్రాలను మించి కలెక్ట్ చేసింది. ఇక ఈరోజు ‘జోకర్’ కు మరింతగా బుకింగ్స్ పెరిగాయంట. అదనంగా స్క్రీన్ లు కూడా పెంచుతున్నారట. దీంతో మల్టీప్లెక్స్ లలో ‘సైరా’ ‘వార్’ లకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. మరి ముందు.. ముందు.. ఏం జరుగుతుందో చూడాలి..!

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus