Jordar Sujatha: తన లవ్ స్టోరీ, కెరీర్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన జోర్దార్ సుజాత.!

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుతో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం అందులో టీం లీడర్ గా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేష్. ఇక జోర్దార్ వార్తలు చదువుతూ ఫేమస్ అయిన సుజాత రాకేష్ సుజాత ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పరిచయం అయి ఆ తరువాత ప్రేమించుకున్నారు.

ప్రస్తుతం ఇద్దరూ కలిసి పలు షోలలో సందడి చేస్తున్న వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాజాగా సుజాత నటించిన ‘సేవ్ ది టైగర్’ సిరీస్ తో అలరించింది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ, కెరీర్ గురించి పంచుకుంది. సుజాత, రాకేష్ ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్లిదరి లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ అసలు ఎవరు ప్రపోజ్ చేసుకున్నామో తెలియదు, ఇద్దరం మొదటి నుండి మంచి స్నేహితులం అంటూ సుజాత తెలిపింది.

రాకేష్ కి పెళ్లి మీద ఇంట్రస్ట్ లేకపోతే ఎన్నో సార్లు ఒక స్నేహితురాలిగా పెళ్లి చేసుకో ఒంటరిగా ఉండలేవు ఒక ఏజ్ వచ్చాక అంటూ సలహా ఇచ్చారట సుజాత.ఇక వాళ్లిద్దరి లవ్ స్టోరీ ఇంత త్వరగా ముందుకు సాగడానికి పెళ్లి త్వరగా అయిపోడానికి కారణం రోజా గారు అంటూ తెలిపారు. ఆమె మొదట కనిపెట్టేసారు రాకేష్ నేను ప్రేమించుకుంటున్నాం అని అంటూ చెప్పారు.

ఇక ప్రేమించుకునే సమయంలో మాకు దగ్గరగా ఉన్న వాళ్ళే మా మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించారంటూ తెలిపారు. నెగిటివ్ గా తన గురించి చెప్పడం లాంటివి చేసారు అంటూ ఎమోషనల్ అయ్యారు సుజాత. ఇక తాను నా లైఫ్ లో లక్కీ పర్సన్ అని తాను లైఫ్ లోకి వచ్చినప్పటి నుండి నాకు లక్ మొదలయిందంటూ ( Sujatha) సుజాత తెలిపారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus