Jr NTR: ఆ సీన్ విషయంలో హర్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో జై లవకుశ సినిమా ఒకటి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించి అద్భుతమైన నటనతో మెప్పించారు. అయితే ఒక సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి తాను చేసిన తప్పు గురించి ఆ తప్పును సరిదిద్దుకున్న తీరు గురించి జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. జై లవకుశ షూటింగ్ సమయంలో ఒకరోజు నేను చాలా టైర్డ్ గా ఉన్నానని ఒకవైపు జై లవకుశ షూటింగ్ మరోవైపు బిగ్ బాస్ షో సీజన్1 షూటింగ్ ఉండటంతో నేను ఇబ్బంది పడ్డానని ఆయన పేర్కొన్నారు.

రావణాసురుడి కోపం కూడా రావణునిలానే ఉంటుందని రావణుడు కట్టలు తెంచుకున్న అగ్నిపర్వతంలా వస్తాడని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఒక సన్నివేశంలో భాగంగా నివేదాను పడేయాలని తోసేశాం అయిపోయిందని తారక్ తెలిపారు. ఆ సీన్ షూట్ అంతా అయిపోయిందని అందరూ చప్పట్లు కొట్టేశారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆ సమయంలో జై పాత్ర నత్తితో కాకుండా సాధారణంగా డైలాగ్స్ చెప్పినట్టు అర్థమైందని తారక్ కామెంట్లు చేశారు.

ఆ సమయంలో నన్ను నేను ఏమనుకోవాలో అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో కుర్చీ తీసి నా తలపై నేనే కొట్టుకుందాం అని అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. నత్తి లేదు బాబీ ఏంటి బాబీ అని కామెంట్ చేయగా పరవాలేదు సార్ అని బాబీ చెప్పాడని నేను మాత్రం సమస్యే లేదని మళ్లీ రీ షూట్ లో పాల్గొన్నానని తారక్ అన్నారు.

జై, లవ, కుశ పాత్రలతో ఆ సీన్ ను షూట్ చేయడం జరిగిందని (Jr NTR) యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించారు. నత్తితో లేకపోయినా పరవాలేదని చెప్పినా సీక్వెన్స్ మొత్తం చేశానని తారక్ పేర్కొన్నారు. గతంలో తారక్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus