RRR Movie: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు నచ్చిన సీన్ అదే!

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ RRR సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచే ఈ సినిమా భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతోపాటు కలెక్షన్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా రావడంతో సినిమాలో నటించిన రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం భారీ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరు హీరోలు కూడా బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కూడా వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Click Here To Watch NOW

ఇక రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపించగా కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా అందరికీ ఇష్టమే అయితే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా అదే తరహాలో వివరణ ఇస్తూ కానీ నిత్యం తనను ఎక్కువగా ఆకట్టుకున్న సన్నివేశం ఒకటి ఉంది అంటూ ఆ సన్నివేశం కోసం చాలా కష్ట పడినట్లు కూడా ఎన్టీఆర్ వివరణ ఇచ్చాడు.

కొమరం భీముడో పాటలోని కొన్ని సన్నివేశాలకు చాలా చాలెంజింగ్ గా అనిపించిదట. ఆ పాటలో నటించడం అంత సాధారణమైన టాస్క్ కాదని కూడా తెలియజేశాడు. ఆ పాటలో చాలా రకాల భావోద్వేగాలను చూపించాల్సి వచ్చిందని ఒకవైపు స్నేహితుడు మోసం చేశాడు అనే బాధ అలాగే అమాయకత్వం, మరొక వైపు అడవి బిడ్డల దైర్యం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఆ పాటలో చూపించాల్సి ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు.

ఎక్కువగా సినిమాలో తనకు ఆ పాట నచ్చినట్లు అని ఎన్టీఆర్ తెలియజేశాడు. ఇక మొత్తానికి RRR సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే 500 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus