Jr NTR: చెన్నై నాకు చాలా స్పెషల్ అని చెప్పిన తారక్.. అసలేమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara) సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. ఈ నెల 22వ తేదీన నోవాటెల్ లో దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత తారక్ అమెరికా వెళ్తారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడిలో శిక్షణ పొందారనే సంగతి తెలిసిందే. చెన్నై ప్రెస్ మీట్ లో తారక్ మాట్లాడుతూ చెన్నై నగరం నాకు ఎంతో ప్రత్యేకమని అన్నారు.

Jr NTR

వెంపటి చిన సత్యం సర్ దగ్గర నేను కూచిపూడి నాట్యం నేర్చుకున్నానని ఆ కారణం వల్లే ఈ ప్లేస్ నాకు ఎంతో స్పెషల్ అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇండియాలోని లెజెండరీ మాస్టర్స్ లో వెంకట చిన సత్యం ఒకరు. ఆయన తన ప్రతిభతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంత ప్రతిభ ఉన్న మాస్టర్ దగ్గర కూచిపూడి నేర్చుకోవడం వల్ల తారక్ డ్యాన్స్ లో టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చెన్నైలో ప్రెస్ మీట్ లో తమిళంలో మాట్లాడి తారక్ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. చెన్నైలో దొరికే దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ అంటే నాకు ఇష్టమని తారక్ పేర్కొన్నారు. చెన్నైలో ఫేమస్ అయిన ఆ బిర్యానీ గురించి ఎన్టీఆర్ చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దేవర తమిళ వెర్షన్ కు సైతం తారక్ సొంతంగా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

తమిళం మాట్లాడటం, తమిళంలో డైలాగ్స్ చెప్పడం సులువైన విషయం కాదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సునాయాసంగా మాట్లాడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. టాలెంట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ టాప్ అని కొన్ని విషయాలలో తారక్ కు ఎవరూ సాటిరారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా ఆరు విజయాలను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు దేవర సినిమాతో మరో భారీ విజయం దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 ‘రాక్షస రాజు’ ఆగిపోయింది.. దర్శకుడు తేజకి ఇదైనా కలిసొస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus