తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ మాట్లాడుతూ తారకరత్న మాసివ్ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారని అన్నారు. బెటర్ ఐసీయూ కేర్ కోసం బెంగళూరులోని ఆస్పత్రికి తీసుకొచ్చామని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ఆ సమయంలో కొంత సమయం పాటు హార్ట్ బీట్ ఆగిపోయిందని బాలయ్య కామెంట్లు చేశారు. ఆ తర్వాత అద్బుతం జరిగినట్టు మళ్లీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందని బాలకృష్ణ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. డాక్టర్లు తారకరత్న కోలుకోవడానికి డాక్టర్లు కేర్ తీసుకుంటున్నారని బాలకృష్ణ కామెంట్లు చేశారు. తారకరత్న కోసం అందరూ ప్రార్థనలు చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలియడంతో కర్ణాటక సీఎం కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రిని ఆస్పత్రికి పంపారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తారక్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.
తారక్ ఇప్పటికే ఆస్పత్రికి చేరుకోగా తారక్ కూడా మీడియాతో మాట్లాడారు. తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. తారక్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తారకరత్నకు ఎక్మో అమర్చలేదని అన్నారు. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!