Mahesh Babu: మహేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఈమేనా..?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపును తెచ్చిపెట్టే పాత్రల్లో నివేదా థామస్ ఎక్కువగా నటించారు. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నివేదా వకీల్ సాబ్ సినిమాలో పల్లవి పాత్రలో నటించి మెప్పించారు. ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఏ సినిమాలో నటించినా ఆమె క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అయితే ఈ బ్యూటీ సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం నివేదా థామస్ ఎంపికయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తన ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్స్ కు సైతం మంచి పాత్ర ఉండేలా జాగ్రత్త పడే త్రివిక్రమ్ శ్రీనివాస్ నివేదా థామస్ కొరకు ఎలాంటి పాత్రను డిజైన్ చేశారో చూడాల్సి ఉంది. నివేదాకు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు రావడానికి మరో కారణం కూడా ఉంది.

మిగతా హీరోయిన్లలా నివేదా థామస్ పాత్రకు సంబంధించి షరతులు పెట్టదు. పాత్ర గుర్తింపు తెచ్చిపెట్టేలా ఉంటే కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే మల్లూ బ్యూటీ నివేదా మహేష్ సినిమాలో నటిస్తే మాత్రం నటిగా మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నటనలోనే కాదు డ్యాన్స్ లో కూడా సత్తా చాటుతుండటం నివేదా థామస్ కు ప్లస్ అవుతోంది. ఎలాంటి పాత్రకైనా పూర్తిస్థాయిలో న్యాయం చేసే నివేదా థామస్ కు ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus