యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఏ వాహనం కొనుగోలు చేసినా ఆ వాహనానికి 9999 నంబర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ నంబర్ ఒక విధంగా తారక్ కు సెంటిమెంట్ నంబర్ అనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా తారక్ కొనుగోలు చేసిన కారుకు మాత్రం కారు నంబర్ మారింది. తారక్ కొత్తగా కొనుగోలు చేసిన కారు నంబర్ “tg 09 1422” కావడం గమనార్హం.
మెర్సిడెస్ బెంజ్ సెడాన్ కారుకు నంబర్ మారడం వెనుక అసలు రీజన్ వేరే ఉందని తెలుస్తోంది. తన కొడుకుల పుట్టినరోజులు వచ్చేలా తారక్ ఈ కారును తీసుకున్నారని సమాచారం అందుతోంది. పిల్లలపై ప్రేమతో తారక్ చేసిన ఈ పనికి ఫిదా అవ్వాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో 9999 నంబర్ కంటే 1422 నంబర్ ఖరీదు తక్కువనే సంగతి తెలిసిందే.
అభయ్ రామ్ పుట్టినరోజు జులై 22 కాగా భార్గవ్ రామ్ పుట్టినరోజు జూన్ 14 కావడం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కారు నంబర్ విషయంలో మారడం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తారక్ కు సోలో హీరోగా భారీ సక్సెస్ దక్కితే మార్కెట్ రెట్టింపు అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీడెడ్ లో తారక్ సినిమాలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
దేవర (Devara) చివరి షెడ్యూల్ త్వరలో మొదలుకానుండగా ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. దేవర సినిమాతో ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటానని తారక్ చెబుతున్నా రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ సినిమాల కోసం ఎంతో కష్టపడతారు. అయితే కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. తన సినిమాల స్థాయి మరింత పెరిగేలా తారక్ తెలివిగా మరింత కష్టపడాల్సి ఉంది.